![]() |
అందరినీ కరుణ తో కాపాడే మన అమ్మ..! నీ బొమ్మ వేయలేకపొయినా నిన్నిలా మెరిపించగలిగాను అమ్మ..! |
ఎందెందు వెతికేది అమ్మా నిన్ను
సంగీత రూపిణి సాహిత్య ధారిణి ..!
'శ్రుతు'లే శయనమాయె నీ 'నయనముల'లో
'స్వరము'లే నర్తించే నీ 'తిలకము'లో
'రాగము'లే కదలాడె నీ 'దరహాసము'లో
'కీర్తన'లనే కొనియాడె నీ 'రూపము'లో....!
'తాళము'లె తాండవమాడె నీ 'కర్ణము'లలో
'సాహిత్య'మె సువర్ణమాయె నీ 'కంఠము'లో
'వేదము'లె వెలసె నీ 'వాక్కు'లలో
'కళ'లే కీర్తింపబడె నీ 'హృదయము'లో ..!
సప్తవర్ణాలు కలిసి వెసె నీకు 'పద్మాసనము'
సప్తవర్ణాలు విరిగి ఎగసే నీ 'కురుల'లై
'సప్తస్వరాలే 'మ్రోగె నీ వీణ లో అమ్మ,
'సప్తసముద్రాలె' పొంగే ఈ 'సీతాహ్రుద్యానందం' లో...!
అమ్మ,
నీ నిలయమయిన ఇన్ని కంటిని
నీ రూపమును కనలేకపోతిని ...!
అమ్మ కే అంకితం ...!
--
సీత
అబ్బా.. మీకు అమ్మ అంటే ఎంత భక్తి సీతగారు.. చాల బాగుంది..
ReplyDeleteఆ సరస్వతి మాత కృపాకటాక్షాలు మీపై సదా కురియాలని ఆశిస్తూ....
meripinchaaru, muripinchaaru kuda mee kalalatho...
ReplyDeletebhgundandi mee kavitha.
చాలా బాగుందండీ!
ReplyDeleteఆ వీణాపాణి మీ కలాన్ని నిరంతరం
ReplyDeleteవ్రాసేలా చేయమని ప్రార్థిస్తున్నాను
@శ్రీ
@భరద్వాజ్ గారు
ReplyDeleteచాలా చాలా సంతొషం అండీ.బొలెడు భన్యవాదాలు...!!అమ్మ కృప మీపై సదా ఉండాలని ఆకాంక్షిస్తూ...
--సీత
@శ్రీ గారు
సంతొషం తో కూడిన ధన్యవాదాలండీ..!!
@భాస్కర్ గారు
మెరిపించినా మురిపించినా అంతా అమ్మ ఇచ్చిందే కదండీ....!!
ఆనందం గా ఉంది.ధన్యవాదాలండీ..!!
@రసజ్ఞ గారు...
ReplyDeleteమీకు స్వాగతమండీ..!!
చాలా ఆనందం గా ఉంది.
ధన్యవాదాలు అండీ..!!
--సీత
okkokka varnana maaku chaalaa nachaayanDii...
ReplyDeletechaalaa baundi seeta gaaruu...
amma ki vandanam.