నీటికి అలమటించిన మా ఊరు
పవనాన్ని బతిమాలె పదే పదే
రాయబారంపంపే మేఘాలకు
మన్నించి కరుణించి కురవమని
ఎండ వేడి కి తడి ఆరిన ఆకులు
నీటి ఆవిరుల లేఖలు పంపె
ముచ్చటపడిన మార్తాండుడు
శాంతిపొంది మబ్బులని పిలిచె
కందిపొయిన పూలరేకులు
కోపగించి ముడుచుకు పోయె
చూసి కలతచెందిన వరుణుడు
మంచుకరగతీసి చల్లదనం కూర్చె
కనులు తెరవని మూగజీవులు
మూలుగుతూ రాగాలాలపించె
కరుణ హృ దయుడు కదలిపోయె
జాలి చూపి పగలే జాబిలి చేసె......!!!!
enjoyed rain...
enjoyed rain...
--
సీత
.....
cool....
ReplyDeletenice :)
thank you :-)
Deleteసీత గారు చాలా బాగుంది...
ReplyDeleteమా ఊరిలో ఈ రోజు వాన పడింది.. నేను full Happy... మీ కవితతో ఇంకా హ్యాపీ.. సూపర్....
అవునా భలే :-)
Deleteధన్యవాదాలండీ
ఇక్కడ కూడా వానే, మీ కవితామహత్యమేనా.......
ReplyDeleteచక్కని కవిత , అభినందనలు.
ఏమో మరి వర్షాన్నే అడగాలి :-)
Deleteధన్యవాదాలండీ :)
ప్రతి పలుకు మీదైన శైలి ! చాలా అద్భుతం!!
ReplyDeleteజాలి చూపి పగలే జాబిలి చేసే .. చాలా బాగుంది సీత గారు.
చాలా ఆనందం అండీ :)
Deleteబోలెడు ధన్యవాదాలు !!
పగలే జాబిలై మదిని చల్లపరిచెను మీ కవిత.
ReplyDeleteఅంత కన్నా కావలసిందేముంది ...ధన్యవాదాలండీ :-)
Deleteమీ కవిత కూడా .... జలజల రాలే వాన జల్లులా చక్కగా ఉందండి.
ReplyDeleteచాలా ధన్యవాదాలండీ :-)
Delete'అమృత వర్షిణి'- రాగం
ReplyDeleteఆల పించె నేమొ ! సీత !
ఆకాశం చిల్లులు వడి
అవని తడిసె చిరుజల్లుల ....
----- సుజన-సృజన
రాజారావు గారు...
Deleteనేనేమీ ఆలపించలేదు సుమండీ:-)
బహు ధన్యవాదములు
nice seeta..
ReplyDeletethank u so much :-)
Deleteఎండ వేడికి తల్లడిల్లిన మూగ జీవుల ఆలాపన విని జాబిలంత చల్లగా కరుణించి వర్షించిన వరుణ దేవుడు...
ReplyDeleteఆ చల్లదనం కవితలో కమ్మగా చిలికించిన "సీత" కవితా రాగాలూ....
బాగుంది.
బోలెడు ధన్యవాదాలు అండీ :-)
Deletenice andi
ReplyDeletethanks prince garu :-)
Deleteమీ కవితల్లో పరిపక్వత కనిపిస్తోంది నానాటికీ...
ReplyDeleteఅభినందనలు మీకు...
చక్కని కవిత వానపై.....
@శ్రీ
అంతా మీ అందరి ప్రోత్సాహం ,అభిమానం.
Deleteబోలెడు ధన్యవాదాలు :-)