ఊయలలూగు కృష్ణ ఊయలలూగు
కమ్మగా వింటూ ఊయలలూగు
వ్రేపల్లె నీకు ఊయాల కట్టి
గోపెమ్మ ఎద మెల్లగా ఊపే
నందునీంట వెలసీ జగమందు
కనువిందై వెలిగే నీ లీల ...!!
కన్నతల్లై దేవకి పొందిన దే భాగ్యమూ?
మనసార హత్తుకున్న యశోద కెంత పుణ్యమూ?
ఆటలాడి అన్నిచేసే నీ స్నేహితుల కెంత స్థైర్యమూ?
అలరారి మురిసిపోయే గోపికల దెంత ఆనందమూ..??
నీలో లీనమయి నీ ప్రేమ పొందిన రాధదే అదృష్టము?
నీతో సహచర్యము చేసి నీ అనురాగంపొందిన భార్యలదే సౌఖ్యము ?
నిన్నే కీర్తించి నీలోనే ఏకమయిన నీ భక్తుల దే స్థానము ?
నీ చేత సమ్హరించబడ్డ రాక్షసుల దేంతటి వైభోగము ?
ఈనాటి ఈ సేవ నీవందుకొని
ఆనాటి అనుభూతులన్నీ నా ఎద నిండనీ
ఊయలలో నీవు కనులవిందై ఊగుతూ
ఊయలూపుతూ నన్నిలా ఉండిపోనీ కృష్ణా....!!
--సీత
--సీత
సీత గారూ..
ReplyDeleteకృష్ణయ్యను ఊయలలూపుతూ ఆయన లీలలను చక్కగా వర్ణించారండీ...
చాలా బాగుంది..
రాజీ గారు...
Deleteభలే ఆనందం :-)
ధన్యవాదాలండీ
సీత యశోద మ్మయ్యెను
ReplyDeleteచేతులలో బిడ్డ డయ్యె శ్రీకృష్ణుండే
శ్రీతల్పపు టూయెలలో
ప్రీతిగ తా నూచ గల్గు భాగ్యము పొందెన్ .
సుజన-సృజన
రాజారావు గారు
Deleteబాగా చెప్పారండీ ...అంతకు మించిన భాగ్యమా అండీ...
చాలా చాలా సంతోషం అండీ ...ధన్యవాదాలు :-)
ఉయ్యాలలూగుము కృష్ణ, ఊపుచున్నది సీతమ్మ,
ReplyDeleteతన కవితలనే జోలపాటలుగా పాడుచుండ,
భక్తి సామాజ్యపు వింధ్యామరలు వీచుచుండగా,
ప్రేమ అనెడి పాన్పుపై పవళించి,
ఆ యశోదమ్మ కాదు ఈ సీతమ్మే మాయమ్మ అని అక్కడే ఉన్నచో ఎలాగనయ్యా..?
ఈ దాసులనూ కాస్త కనికరించవయ్యా..కరుణా సముద్రా...
సీతగారు చాలా బాగుంది అండీ.. సూపర్...
సాయి గారు
Deleteఅంత ప్రేమ గా పిలిస్తే కరుణ హృదయుడు కదిలి మీ వద్దకే
వస్తున్నాడు సీతమ్మ ఒడి వదిలేసి ....చాలా సంతోషం
ధన్యవాదాలు అండీ :-)
రోజంతా పూజలతో విందులతో,వినోదాలతో ,
ReplyDeleteసాయంకాలం ఉట్టి సంబరాలలో అలసి సొలసిన కన్నయ్యకి...
పాడిన లాలి ...చాలా బాగుంది సీతగారూ!
@శ్రీ
శ్రీ గారూ
Deleteచాలా సంతోషం అండీ ..:-)
ధన్యవాదలు :-)
Lucky kittayya!
ReplyDeleteAs usual super Seetammaa :)
హర్షగారు...
Deleteలకీ కన్నయ్యంటారా...నేను కాదా......;)
సరే...! ;-)
థాంక్యూ సో మచ్......