Friday 11 May 2012

ప్రేమ కై ఆశ తో....


ప్రేమ కై ఆశ తో....
"ఒక్కటి" గా విహరిస్తూ ఆలయానికోచ్చిందో  చిలుక... 
"రెండై "జతగా ప్రపంచాన్ని చూడాలని ఆశ తో.....

"మూడు" పూల తో ముచ్చట గా మహేశ్వరుణ్ణి   పూజించింది
'నాలుగు" కాలాలు నవ్వుతూ జతగా ఎగరాలనే   ఆశ తో....

"పంచ"మి నాట పార్వతి  ని  ప్రేమ గా అడిగింది 
"షడ్జ"మ కోకిల లా  తన జీవితానల్లె  రాగాలనాలపించాలనే ఆశ తో....

"సప్త"వర్ణాల హరివిల్లు ఆకాశం లో విస్తరించిన వేళ
"అష్ట"మి నాడు ఆశ గా ఆరభి రాగం తననల్లుతోన్న వేళ
తన "తొమ్మిది" రోజుల ఎదురు చూపుకు తెరపడి తన " ప్రేమ " తనని చేరిన  వేళ....

"పది"కాలాల ప్రేమానందమయిన  జీవితాన్ని ప్రేరేపిస్తూ....
"పదకొండు" మార్లు ఉమా-మహేశ్వరులకి ధన్యవాదాలు చెప్పి
"పన్నెండు"చెట్లు దాటి "పదమూడో " చెట్టు చేరి ఊసులాడుకుంటున్నాయి..........!!!!

చూడండి మరి...
--మీ  సీత 


8 comments:

  1. ఈ " పద్నాలుగు " లోకాల్లో మీలా ఇలా కవిత రాయడం ఎవ్వరి వల్లా కాదండీ బాబోయ్........సీత గారు అద్భుతంగా ఉంది..... సూపర్..

    మీ కవిత లోని ఆ పక్షుల లాగానే మీ జీవితం కూడా అలానే ఆనందమయంగా సాగిపోవాలని ఆశిస్తూ....

    ReplyDelete
    Replies
    1. సాయి గారు నా అంకెల ప్రేమాట మెచ్చినందుకు ధన్యవాదాలండీ....

      Delete
  2. Replies
    1. very very happy .thanks sruthi gaaru........

      Delete
  3. మీ సంఖ్యా కవిత్వం బాగుందండోయ్!
    @శ్రీ

    ReplyDelete
  4. @రవిశేఖర్ గారు
    థాంక్యూ అండీ..!!

    @శ్రీ గారు...
    సంతొషం ధన్యవాదాలండోయి......!!

    ReplyDelete
  5. అన్వేష్May 31, 2012

    wow...wow...simply super seeta gaaru

    ReplyDelete