Monday 28 May 2012

నీవే నేనవుతా....

నా ఊహల భావాని వి నీవయితే
నీ ఊహలఊయల లో బంధీ ని నేనవుతా

నా అందెల ని సవ్వడి చేసే అల్లరివి నీవయితే
నీ అల్లరి లో అలుపెరగని అలనే నేనవుతా 

నా మదిని మురిపించే వేణు గానమే నీవయితే
నీ మది పై చేరి మరిపించే  మల్లే ని నెనవుతా

నా కోపం  లో కసి గా కవ్వించే యుద్దానివి నీవయితే
నీ చే ఓటమి పాలై నీ గెలుపు గర్వాన్నే నేనవుతా

నా బాధలో ఓదార్పు నిచే అమ్మ వు నీవయితే
నీ ఒడి లో ఒదిగే పసిపాప నేనవుతా

నా గుండె గుడికి దీపానివి నీవయితే
నీ గుసగుసల గానం లో గోప్యాన్ని నేనవుతా

నా కన్నీటి ని కట్టడి చేసే  వారధి నీవయితే
నీ కై కదలాడే స్నేహాన్ని నేనవుతా

నా చెక్కిలి లో చేరే చిరునవ్వు నీవయితే
నీ చనువు లో నీ చేలి నే నేనవుతా

నా కనులని కలతపరచే కల వి నీవయితే
నీ కనులలో కదలని కవిత ని నేనవుతా

నా పాదాల పై పండిన పారాణి నీవయితే
నీ పెదవుల పిలుపుల కి పులకరింత నేనవుతా

నా నోసట కుంకుమ ప్రతీకవే నీవయితే
నీ పాదాల పై నా చే చేరే పుష్పాన్నే నేనవుతా...

నా నగుమొము ను వెలిగించే రాముడు వి నీవయితే
నీ నీడ నై నీ వెంటే నడిచే  సీత నే నేనవుతా...

నా ఈ ప్రేమ 'పలుకుల'కి పేరే నీవయితే
నీ ప్రేమ నే కోరే "ప్రశ్న" ని నేనవుతా

నా నుండీ దూరమయ్యే "విరహాని" వి నీవయితే
నీ విరహాన్నే వరించే 'వనిత' నే  నేనవుతా..............!!

నీవే నేనవుతా....

సీత..

15 comments:

  1. virahaanni varinchi bharincham antha suluvu kadu kadandi..
    Manchi kavitha.. :-)

    ReplyDelete
  2. ఎప్పటిలానే చక్కగా పలికించారు "సీత" భావాలని.
    ఒకరిలో ఒకరవ్వగలిగే అందమైన అనుభూతే "ప్రేమ".
    కవితలో కోరుకున్నవన్నీ అవ్వాలని ఆశిస్తూ....

    ReplyDelete
  3. మలయ పవనంలా హాయిగా వుంది మీ కవిత.చాలా బాగా వ్రాసారు.

    ReplyDelete
  4. "నా చెక్కిలిలో చేరే చిరునవ్వు నీవైతే
    నీ చనువులో నీ చెలి నే నేనవుతా"....

    "నా కోపంలో కసిగా కవ్వించే యుద్ధానివి నీవైతే"...

    ఎందుకో ఈ భావాలు నాకు అర్థం కాలేదు సీత గారూ!

    మీ మధురమైన భావనలు...
    నిజం కావాలని వేయి దీవెనలతో... ;-)@శ్రీ

    ReplyDelete
  5. భామా కలాప మధురిమ
    ప్రేమా-విరహాల మథ్య పెనవేసి మరీ
    రామునితో సీత పలికె ...
    కోమల కవితా వచ సుథ కోరిక తీరన్
    ----- సుజన-సృజన

    ReplyDelete
  6. సీత పలికింది అందమైన భావం కనుక నేనూ పులకిస్తా ... అందమైన బావన అలవోకగా పలికిందీ సీత కదా

    ReplyDelete
  7. @సాయి గారు
    థాంక్ యు వెరిముచ్

    @నేస్తం గారు
    విరహాన్ని వరించడం లో నే నిజమయిన ప్రేమానుభూతి ని పొందగలం కదండీ..దానికి చాలా రుజువులు కుడా ఉన్నాయి కదా...!!!



    చిన్ని ఆశ గారు
    చాల సంతోషం మీరు మంచిమనసుతో జరగాలని కోరుకున్నందుకు.
    చాలా ఆనంధన్యవాదాలు...!!


    రవిశేఖర్ గారు
    చాలా సంతోషం అండీ.ధన్యవాదాలు...

    --సీత

    ReplyDelete
  8. @శ్రీ గారు
    మారు మారు ఆలోచిస్తే మధురమయిన భావాలన్నీ అర్దమవుతాయి.
    చాలా ధన్యవాదాలు మీకు .

    @వెంకటరాజారావు గారు
    "రామునితో సీత పలికె" నని చక్కగా నా మనోభావాన్ని చెప్పి కొరుకున్నందుకు ఆనందం తో కూడిన ధన్యవాదాలు ....!!

    @ఫాతిమా గారు
    ఈ సీత పలుకులకి మీరు పులకించినందుకు నాకు చాలా సంతోషం గా ఉంది.
    చాలా ధన్య వాదాలు అండీ..!

    ReplyDelete
  9. చాలా బాగా రాశారు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మంజు గారు...!!

      Delete
  10. అన్వేష్May 31, 2012

    seeta gaaruu
    chaalaa baagundi.super ga undandii..
    nijamaina prema ki ardam cheppaaru.
    premani kore prasna ayyi mee prema ki samaadhanam kudaa preme avvalani aasistunnaanu.
    chaalaa rojula taruvaata mee blog kochanu.
    chaala miss ayanu :-(.

    ReplyDelete
    Replies
    1. thanks andii...చాలా రొజుల కి వచ్చారు...

      Delete
  11. jalatharu vennala gaarila raayaalante
    manchi kavithavvu neevithe,
    hathukune comment nu nenoutha..........
    keep writing.

    ReplyDelete
    Replies
    1. జలతారువెన్నెల గారు ఎప్పుడూ నా బ్లాగ్ కి రాలేదండీ.....మీరు జలతారువెన్నెల గారు లా చెప్పినందుకు చాలా ఆనందం గా ఉంది...మీ కామెంట్ హత్తుకుంది కాబట్టి నా కవిత మీకు నచ్చింది అనమాట ..థాంక్ యూ bhaskar garu..

      Delete