.gif) |
అందరినీ కరుణ తో కాపాడే మన అమ్మ..!
నీ బొమ్మ వేయలేకపొయినా
నిన్నిలా మెరిపించగలిగాను అమ్మ..! |
ఎందెందు వెతికేది అమ్మా నిన్ను
సంగీత రూపిణి సాహిత్య ధారిణి ..!
'శ్రుతు'లే శయనమాయె నీ 'నయనముల'లో
'స్వరము'లే నర్తించే నీ 'తిలకము'లో
'రాగము'లే కదలాడె నీ 'దరహాసము'లో
'కీర్తన'లనే కొనియాడె నీ 'రూపము'లో....!
'తాళము'లె తాండవమాడె నీ 'కర్ణము'లలో
'సాహిత్య'మె సువర్ణమాయె నీ 'కంఠము'లో
'వేదము'లె వెలసె నీ 'వాక్కు'లలో
'కళ'లే కీర్తింపబడె నీ 'హృదయము'లో ..!
సప్తవర్ణాలు కలిసి వెసె నీకు 'పద్మాసనము'
సప్తవర్ణాలు విరిగి ఎగసే నీ 'కురుల'లై
'సప్తస్వరాలే 'మ్రోగె నీ వీణ లో అమ్మ,
'సప్తసముద్రాలె' పొంగే ఈ 'సీతాహ్రుద్యానందం' లో...!
అమ్మ,
నీ నిలయమయిన ఇన్ని కంటిని
నీ రూపమును కనలేకపోతిని ...!
మా అమ్మ
కోసం నా ఈ చిన్ని పాట/కవిత.అమ్మ కే అంకితం ...!
--
సీత